#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మత సామరస్యానికి బిజెపి, ఆరెస్సెస్ అడ్డంకి

(సిపిఎం తెలంగాణ రాష్ట్ర కారదర్శి తమ్మినేని వీరభద్రం.)

దేశంలో ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల సందర్బంగా బిజెపి అగ్ర నాయకత్వం ఓట్లువేయని వారి ఇండ్లపై జెసిబి, బుల్డోజర్లతో దాడులు చేస్తామంటూ బెదిరిస్తూ, భారత దేశ ప్రజల మధ్య మత సామరస్యాన్ని భంగం కలిగిస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తుందని సిపిఎం దేశంలో బిజెపి ఆటలు సాగనివ్వబోమని లౌకిక శక్తులను ఐక్యం చూస్తూ బిజెపిపై పోరాడుతామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.

  దివి: 23-02-2022 బుధవారం రోజున జనగామ మండలం పెంబర్తి గ్రామంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల సందర్బంగా బిజెపి అగ్ర నాయకత్వం ఓడి పోతామనే భయంతో పిచ్చెక్కి వికృతచేష్ఠలతో బీజేపీ ఓడిపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామని భయంభ్రాంతులు కల్పిస్తూ, ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే హైద్రాబాద్లో ఈ నెల 15 మంగళవారం రోజున ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకప్రకటనలో యోగి శత్రువులంతా ఒక్కటే, యోగిని ఎన్నికల్లో ఓడించాలని చూస్తున్నారని, ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేసినట్లు కన్పిస్తున్నదని వ్యాఖ్యానించారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో రెండోదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది, ఇంకా ఐదు  దశలున్నాయని ఇప్పటికే జెసిబిలు, బుల్ డోజర్లు తెప్పించాం, ఎవరైనా యోగికి వ్యతిరేఖంగా ఓటేస్తే వాటితో తొక్కిస్తాం, అలా ఓటేయాలనుకునేవారు ఉత్తరప్రదేశ్ లో ఉండరని, రాష్ట్రం విడిచి వెళ్లిపోవాల్సిందేఅని ఇంత బాహాటంగా చట్టబద్దంగా ఎన్నికైనా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు బెదిరిస్తూ మాట్లాడటం చట్టవిరుద్ధమని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు వెంటనే స్పందించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, చంపేస్తామని ఓటర్లను భయబ్రాంతులను చేస్తున్న ఉన్మాదులపై  న్యాయస్థానాలు, ఎన్నికల కమీషన్ సుమోటోగా కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర శివమెగ్గ లో హర్ష అనే వ్యక్తిని ముస్లింలే చంపారని హిందూ మతం కోసం చనిపోయిన గొప్ప వీరునిగా కాషాయ మూకలు, ఆరెస్సెస్ శక్తులు హర్ష మరణాన్ని చిత్రిస్తున్నాయని హర్ష సోదరి స్వయంగా చెప్పారని ఇది ముస్లింల మీద నెట్టేసి మతఘర్షణలు సృష్టిస్తున్నారని విమర్శించారు. జనగామలో ఆకతాయిలను తీసుకొచ్చి బిజెపి కార్యకర్తలని చెప్పి టిఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తూ మతఘర్షణలకు పాల్పడుతుందని తెలిపారు. ప్రతి సమస్యలో మతాన్ని, ప్రతి సమస్యలో రాజకీయం చేస్తూ, ప్రతి సమస్యలో బిజెపి ఎదగాలని చూస్తుందని విమర్శించారు. దేశంలో లౌకిక శక్తులను కాపాడాలని, వాటి ఐఖ్యత కోసం సిపిఎం గా ముందుకెళ్తామని తెలిపారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపి ప్రజావ్యతిరేక పరిపాలనను విమర్శిస్తుందని, ఇది చాలా సంతోషకరమైన విషయం సీపీఎం గా స్వాగతిస్తున్నాం, ముక్యంగా రాష్ట్రాల హక్కుల కోసం, ఇచ్చిన హామీల కోసం, అన్ని రాష్ట్రాలను కలుపుకుని పోరాడాలని నిర్ణయించడం చాలా సంతోషకరమని తెలిపారు. ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చెప్పడం ఇప్పుడు సరైంది కాదని, గతంలో ఇలాంటి ఫ్రంట్ ల ద్వారా ఒరిగిందేమీలేదని తెలిపారు. ఎన్నికలు రాజకీయలబ్ది కోసం జరిగే పోరాటం కాదని తెలిపారు. తెలంగాణలి కేసీఆర్ ఇచ్చిన హామీల సంగతి చెప్పాలని అలాగే నీళ్లు, నిధులు, నియామకాల విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగభృతి సంగతే తేలలేదని, దళితబందు ఎన్నికల స్ట0టుగానే ఉందని దళితబందు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తెలిపారు. పోడు భూములందరికి పట్టాలిస్తామని చెప్పి మాటతప్పారని, పోడు భూముల సమస్య పరిష్కారమయ్యేవరకు, ఇచ్చిన దరఖాస్తులు పరిశీలన అయ్యేవరకు ఆ భూముల్లోకి పోలీసులను, అటవీ అధికారులను పంపించమని చెప్పారని, కానీ మాట తప్పారని విమర్శించారు. భూముల చుట్టూ కంచెలు, కందకాలు, భూములను ఆక్రమించుకుంటున్న ప్రభుత్వం పోడు రైతులకు ఇచ్చిన మాటనిలుపుకోలేదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచుదామని కసరత్తులు చేసిన ప్రభుత్వం వెంటనే ప్రజలనుంచి వ్యతిరేకతను గమనించి దొడ్డిదారిన కరెంట్ బిల్లులపై భారాలు మోపాలని చూస్తుందని ప్రజలపై భారాలు మోపే నిర్ణయాన్ని వినక్కి తీసుకోకాపోతే మరో విద్యుత్ పోరాటం రాష్ట్రంలో చూడాల్సివస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని దాని మూలంగానే విఆర్ఏ, విఆర్ఓ సమస్యలు వస్తున్నాయని వెంటనే వీరి సమస్యలు  పరిష్కరించాలని తెలిపారు. పాలకుర్తి మండలంలోని మంచుప్పుల గ్రామంలో సర్వే నెంబర్ 22లో అప్పటి ప్రభుత్వం 1993లొ ఇండ్లు లేని నిరుపేద దళితులకు 52 మందికి ఇళ్ల స్థలాల కోసం స్థలం కేటాయిస్తే గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ఆభూములను పట్టా చేసుకొని ఆక్రమించుకున్న దళిత ల అధివృద్దే మా ప్రభుత్వ ధ్యేయం అని చెబుతున్న దళితులకు అప్పగించిన భూములను దళితులకు ఎందుకు అప్పగించడం లేదని విమర్శించారు. వెంటనే వారి భూములను వారికి అప్పగించకుంటే సిపిఎం గా పోరాడుతామని తెలిపారు. ఈ నెల 11న జనగామ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ జనగామ జిల్లా కు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ మూడు రోజుల్లో జీ.వో ను విడుదల చేస్తామని చెప్పి పదకొండు రోజులు అయిందని నేటికీ జీ.వో రాలేదని అసలు వస్తుందాని ప్రశ్నించారు. తక్షణమే మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ జీ.వోవిడుదల చేయాలని లేనిపక్షంలో సిపిఎం పోరాడుతుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ బాధాకార్పొరెట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందని వెంటనే సవరణలు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని పిబ్రవరి 25న దేశ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టామని ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.అబ్బాస్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమన్న, గొల్లపల్లి బాపురెడ్డి, సింగారపు రమేష్, బోట్ల శేఖర్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, ఎన్నకుస కుమార్, బోడ నరేందర్, జోగు ప్రకాష్, పొదల నాగరాజు, చిట్యాల సోమన్న, ఎం.డి. సభానా, ఎం.డి. అజారోద్దిన్, భూక్యా చందు నాయక్, బెల్లంకొండ వెంకటేష్, కోడిపాక యాకయ్య, మునిగేల రమేష్, పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్, బాల్నే వెంకటమల్లయ్య, దూసరి నాగరాజు, కళ్యాణం లింగం, పందిళ్ల కల్యాణి, పల్లెర్ల లలిత, కొండ వరలక్ష్మి,  మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, బొడ్డు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.