#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

….మహమ్మద్ జహంగీర్
ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఈ రోజున ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్ భూముల పై సరైన నిఘా లేక ప్రభుత్వ వైఫల్యం వల్ల వందలాది ఎకరాలు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు.
కబ్జాకు గురైన విషయాన్ని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన వక్ఫ్ అధికారులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జాదారుల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కబ్జాకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనపరచు కొన్ని హద్దులు గుర్తించి పరిరక్షించాలని, జిల్లాలో అధికారులు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీరు కాజా అలీ, గౌరవ అధ్యక్షులు ఎస్కే లతీఫ్ ,జిల్లా కమిటీ సభ్యులు మీర్ ఉస్మాన్ అలీ, ఎస్ డి ఖాదర్,మీరు అహ్మద్ అలీ ,మోక్తర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.