#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69News

జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మంపేట గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో దళారులు వచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నారన్న సమాచారంతో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు గారు అధికార యంత్రాంగంతో అక్కడికి చేరుకొని వారిని అడ్డుకోవడం జరిగింది. తహశీల్దార్ గారు చట్టప్రకారం అక్కడికి వచ్చిన దళారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పగా,మళ్ళీ ఎప్పుడు కొనుగోలు కేంద్రాలకు రామని దళారులు రాతపూర్వకంగా తెలియజేశారు.తదుపరి గుజ్జరి రాజు గారు మాట్లాడుతూ…మార్కెట్ పరిధిలోని ఐకెపి,పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైనా దళారులు వచ్చి వడ్లను కొనుగోలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకొని,లైసెన్సులు రద్దు చేస్తామని వారు హెచ్చరించారు.కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ జీవన్ కుమార్,తహశీల్దార్ స్వప్న,మండల వ్యవసాయ శాఖ అధికారి,స్థానిక సర్పంచ్ మంద మల్లేష్,మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్,ఏఈఓ, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ మాధవులు గార్లు ఐకెపి సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.