వన్యప్రాణులను కాపాడాలని కోరిన-డాక్టర్ సామల శశిధర్ రెడ్డి

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణులను కాపాడాలని కోరిన వన్యప్రాణి పరిరక్షణ సమితి బాధ్యులు డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ప్రపంచంలోని 33 కోట్ల జీవరాశుల్లో వన్యప్రాణి ఒకటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ సంపదను కాపాడుతూ అందులో నివసిస్తున్న వన్యప్రాణులను సైతం కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శశిధర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు అందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అటవీ గ్రామాలకు వెళ్లి వన్యప్రాణి సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వన్యప్రాణుల మనుగడకు తోడ్పడాలని వాటి అభివృద్దికి పాటుపడే విధంగా కృషి చేయాలని శశిధర్ రెడ్డి కోరారు. ఈ భూమ్మీద అ బ్రతికే హక్కు స్వేచ్ఛ మనిషికి ఎలా ఉందో అలాగే ప్రతి ఒక్క జీవరాశికి ఉంటుందని కాబట్టి వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని వారు విఙ్ఞప్తి చేసారు. అందులో భాగంగా నేటి మనుషులు మృగాల కన్నా దారుణంగా నోరులేని మూగజీవాలైన వన్యప్రాణులను ప్రతిరోజు వేటగాళ్లు వేటాడి చంపుకు తింటున్నారు. వన్యప్రాణి అంతరించడం ద్వారా పర్యావరణ వినాశనానికి దారితీస్తుందని గుర్తు చేశారు. కనుక ఇప్పటికైనా యువత మేల్కొని వన్య ప్రాణి సంరక్షణకు నడుం బిగించాలని మృగాళ లాంటి వేటగాళ్లు వేటాడకుండా అడ్డుకోవాలని శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.