వరంగల్ ఎంజీఎంలో దారుణం.. రోగి వేళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు

ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి శ్రీనివాస్ వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడుతున్నారు. శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఐసీయూ వార్డులో ఇలాంటి ఘటన జరగడం దారుణమని రోగి బంధులు వాపోయారు. ఈ విషయం డాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా తామేమి చేయలేని చెబుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. పైప్ లైన్ ద్వారా ఎలుకలు లోపలికి వచ్చి పేషెంట్లను కొరుక్కుతింటున్నాయని వైద్య సిబ్బందే చెబుతున్నారన్నారు. ఐసీయూలో పేషెంట్లను ఎలుకలు కొరుక్కుతింటుంటే.. ఇక సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైప్ లైన్లద్వారా ఎలుకలు వస్తున్నాయని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడంపై ఇక్కడ వైద్యాధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తోంది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.