వరంగల్ నగరం లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరమంతా జలమయమై ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని వరంగల్ & హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. నేడు (13-07-2022) వరంగల్ పోచమైదాన్ తదితర ప్రాంతాలలో మాజీ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి తో పాటు నగర పరిసరాలను, జలమయమైన ప్రాంతాలను పరిశీలించి స్థానిక ప్రజలు పడ్తున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని వర్షాలు కురిసినా ఇలాంటి బాధలు పడలేదని ఎనిమిది ఏండ్ల TRS ప్రభుత్వంలో ప్రజలు మాములు వర్షాలకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సీఎం కెసిఆర్ వరంగల్ నగరానికి ప్రతీ ఏటా 300కోట్ల రూపాయలు అభివృద్ధి కి ఇస్తున్నామని ప్రగల్బాలు పలికి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి KTR గతం లో నగరమంతా జలమయమై ప్రజల ఇండ్లలోకి నీళ్లు వచ్చి ఆస్థి నష్టం,పరిసరాల వసతుల నష్టం, నిత్యావసర సరుకుల నష్టం జరిగితే వరంగల్ నగరం లో పర్యటించి నాటి ఎన్నికల కోడ్ ఉన్నదని హైదరాబాద్ నగరం తో పాటు వరంగల్ నగర ప్రజలకు నష్టపరిహారం పదివేయిల రూపాయిలు ఇస్తామని ఎన్నికల అనంతరం నేటి వరకు ఆ ఊసే తీయలేదని ఇది అబద్ధాల ప్రభుత్వమని అన్నారు.
సీఎం కెసిఆర్ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దెవా చేసి నేటి వరకు ఎనమిది ఏండ్ల పాలనలో నాళాలు ఖబ్జా చేయడం తప్ప వీరుచేసిందేమి లేదని వరంగల్ హనంకొండ కాజిపేట ప్రాంతాల పురవీధులలో ఎక్కడ చూసిన గుంతల రోడ్డులేనని కాకతీయ యూనివర్సిటీ రోడ్ పనులు నేటికీ పూర్తికాక ప్రజలుఎంతో ఇబ్బందులు పడుతున్నారని TRS ప్రభుతం, స్థానిక MLA లు, మంత్రులు, ప్రజాప్రతినిధులుగా వరంగల్ నగర ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో మహమ్మద్ అయూబ్, కొత్తపల్లి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్, రాజేష్, చిప్ప వెంకటేశ్వర్లు, ప్రసాద్, పల్లె రాహుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…