వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో జంగా రాఘవరెడ్డి

ఈరోజు (19/04/2021) వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా 64 వ డివిజన్ లోని ఉనికిచేర్ల గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొని బైరీ కొమురయ్య గారి కోడలు బైరి వరలక్ష్మి గారికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మరియు ప్రజలకు అండగా ఉండే పథకాలను గురించి ప్రజలకు గుర్తు చేశారు. వృద్ధాప్యం అనేది భారం కాకుండా ఉండాలనే ఆలోచనతో అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా ఫించన్లు అందే ఏర్పాటు చేేశారు. అది కూడా ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లోనే లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకున్నారు.పేదరికం పెద్ద చదువుల కలకు ఆటం కాకూడదు అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన వారుంటే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడ్డట్టే అన్నది ఆయన సిద్ధాంతం. అదే మెరుగైన సమాజానికి తొలిమెట్టు అంటారు వైఎస్సార్. డబ్బులేక పై చదువులను ఆపేసే విద్యార్థులకు చేయూత అందించడమే వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకం ముఖ్య ఉద్దేశ్యం.వ్యవసాయానికి అత్యవసరమైన సాగునీటి కొరత లేకుండా చేయాలన్న బృహత్తర సంకల్పంతో, ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని చిన్న, మధ్య, భారీ నీటి పారుదల ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలన్న లక్షంతో చేపట్టిన కార్యక్రమమే జలయజ్ఞం. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం పెంపొంది,  ఆ రంగంలో నిలకడైన పురోగతి సాధ్యమైంది. వైఎస్సార్ వజ్ర సంకల్పానికి నిదర్శనం పేదలకు పక్కా ఇళ్లు పథకం. ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేలా మహానేత ప్రవేశ పెట్టిన పేదలకు ఇళ్లు పథకం లక్షలాది కుటుంబాలకు మేలు చేకూర్చింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే 47 లక్షల ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు అందించారు పావలా వడ్డీ కార్యక్రమం గ్రామీణ మహిళల చిన్న వ్యాపారాలు మరియు వ్యవస్థాపకత ప్రోత్సహించడానికి 3% వడ్డీ రుణాలు ఇచ్చింది. ఆకలి తగ్గించేందుకు ఒక బియ్యం పథకం రెండు రూపాయల కిలోల బియ్యాన్ని అందించింది. బియ్యం కనీస మద్దతు ధర కూడా పెంచిందిరైతులకు ఉచిత విద్యుత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఉచిత విద్యుత్ పథకం. లేట్ ముఖ్యమంత్రి డా. వై. ఎస్. రాజా శేఖర రెడ్డి. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ను అందించే ఏకైక నాయకుడు. గ్రీన్ ఆంధ్రప్రదేశ్ తన దృష్టి. ఇది ఒక రోజులో పొలాలకు 7 గంటల శక్తిని అందిస్తుంది. ఇది 2013 లో 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.రాజీవ్ ఆరోగ్య శ్రీ  పథకం పేద ప్రజల సంజీవినిగా పేరు గాంచింది.  దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజలకు ఆరోగ్య బీమా పథకం, ఈ  పథకం కింద  అవసరమైన వారికి  శస్త్రచికిత్సతో సహా మొత్తం ఖర్చు ₹ 2 లక్షల వరకు చెల్లించటానికి ఏర్పాటు చేయబడింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.