వరలక్ష్మీ మాత పూజా కార్యక్రమాలు సేవా జ్యోతి శరణాలయం లో ఘనంగా నిర్వహించారు

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణు నగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయం లో, శ్రీ వరలక్ష్మీ మాత పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు, ముందుగా శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ – సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ శ్రీదేవి మల్లేశం సగర గజ్జెల్లి వారు శ్రీ వరలక్ష్మీ అమ్మ వారికి పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి లో మన పిల్లలకు ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలి,దీనితో పాటు మన పూర్వీకులు ఆచార వ్యవహారాలు, దేశభక్తి విషయాలు నేర్పించాలి మన తోటి సమాజానికి ఆదర్శంగా జీవించాలని అందరికీ శ్రీవరలక్ష్మీ మాత ఆశీర్వాదాలు ఉండాలని, కోరుతు మా ప్రార్ధన అని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్, కృష్ణ, శంకరం, శ్యామ్, సాయి కుమార్, శివతేజ, లక్ష్మీ , మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.