వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ డే

ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన వన్యప్రాణి సంరక్షణ పరిరక్షణ బాధ్యుడు డాక్టర్ సామల శశిధర్ రెడ్డివరంగల్ అర్బన్ జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఈరోజు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే కార్యక్రమంలో విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి హాజరైన శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జీవరాశి మనుగడ అటవీ జంతువుల సంరక్షణ మరియు పరిరక్షణ ఎంతో అవసరమని అందుకు మనమందరం కృషిచేయాలని వన్యప్రాణులను కాపాడేందుకు విద్యార్థులు ఉపాధ్యాయులు యువత స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని సూచించారు లేదంటే రాబోయే రోజుల్లో ముందు తరాల వారికి పులి అంటే ఇలా ఉండేది అని పుస్తకాల్లో చూపించడానికి మాత్రమే పనికి వచ్చేలా ఉంటుందని మరి జంతు జాతులు పక్షులను అన్నింటినీ మనం సంరక్షిస్తూ తేనే వాటిని రాబోయే తరాల వారికి చూపించే అవకాశం భాగ్యం మనకు దక్కుతుందని వారు పేర్కొన్నారు నా గతం లో నా చిన్నతనంలో మన వరంగల్ జిల్లా అడవిలో పులి ఉండేదని అనంతరం మళ్ళీ తిరిగి 25 సంవత్సరాల తర్వాత పులి సంచరిస్తుంది అని వార్త రావడం చాలా ఆనందంగా ఉందని అందుకు మనం చాలా గర్వపడాల్సిన విషయం అని ఆయన వివరించారు ప్రస్తుతం మన భారతదేశంలో చిరుత పులి జాతి అంతరించి పోయిందని రాబందులు అంతరించి పోయాయని ఇప్పుడు తిరిగి వాటిని తీసుకురాగల మా వాటిని చూపించాలంటే విద్యార్థులకు పిల్లలకు పుస్తకాల్లో తప్ప ప్రత్యక్షంగా కనిపించే పరిస్థితి లేదన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వన్యప్రాణి సంరక్షణ అటవీ సంరక్షణ మొక్కల పెంపకాన్ని మన కర్తవ్యంగా భావించి అందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారిని అభినందిస్తూ చిత్రలేఖన పోటీలు బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఓరుగల్లు చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్బరుద్దీన్ గారు వరంగల్ అర్బన్ జిల్లా అటవీశాఖ అధికారి డాక్టర్ రామలింగారెడ్డి గారు రిటైర్డ్ భూపాలపల్లి జిల్లా అటవీ శాఖ అధికారి పురుషోత్తం గారు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు నాగేశ్వర రావు గారు ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ గారు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.