khammam news bjp news sc news

మూడు దశాబ్దాల దండోరా ఉద్యమం సామాజిక న్యాయం కోసమే
నిరసన దీక్షలో ఎమ్మెస్పీ జిల్లా కోఆర్డినేటర్… ఏపూరి
సామాజిక న్యాయమే ఎస్సీ వర్గీకరణ అని బీసీలను ఏబిసిడిలుగా వర్గీకరించినప్పుడు జరిగిన నష్టం ఎస్సీ వర్గీకరణ చేస్తే జరుగుతుందా ఇది రాజకీయ పార్టీల నమ్మకద్రోహానికి నిదర్శనం కాదా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందనప్పుడు సామాజిక న్యాయం ఎలా జరుగుతుందని ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ఎనిమిది సంవత్సరాలైనా ఆచరణకు నోచుకోకపోవడం నిర్లక్ష్యమా సామాజిక న్యాయమా బిజెపి స్పష్టం చేయాలని అన్నారు. ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని జూలై 3న హైదరాబాదులో జరిగిన బిజెపి సంకల్ప సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిన బిజెపి. మాదిగ జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ తో బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా తల్లాడ మండల కేంద్రంలో నిరసన దీక్షను ప్రారంభించి.. ఏపూరి ప్రసంగించారు. వర్గీకరణ చేయకుండా బిజెపి మోసం చేయాలని చూస్తే మాదిగ పల్లెలకు రానివ్వద్దని బిజెపిపై యుద్ధానికి మాదిగ జాతి సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వెంకటేశ్వర్లు, ఇసినేపల్లి లక్ష్మణ్ కృష్ణార్జున్ రావు, ఇసినేపల్లి బాబురావు, ఆదూరి బాబు, నల్లగట్ల బాబు, బాలకృష్ణ, రవి, మైనర్ బాబు, వేణు, నవీన్, మేడి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.