జనగామ పట్టణంలో ఏసిరెడ్డి నగర్ కాలనీవాసుల కోసం పునరావాస పథకంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వర్షాలకు కురుస్తున్న సందర్భంగా నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టి నష్టపరిహారం రికవరీ చెయ్యాలని పనులు పర్యవేక్షించిన పంచాయతీరాజ్ అధికారులను సస్పెండ్ చేయాలని మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఆటపాట నిర్వహించిన ఎసిరెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు…
అనంతరం జిల్లా కలెక్టర్ శివ లింగయ్య కు వివిధ డిమాండ్స్ తో మెమొరాండం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే హౌసింగ్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దామోదర్ తో మున్సిపల్ కమిషనర్ రవీందర్ యాదవ్ తో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఏసిరెడ్డి నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు
