వల్లపురం సర్పంచ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే బొల్లం

వల్లపురం సర్పంచి వట్టికూటి చంద్రయ్య ని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు పరామర్శించారు. చంద్రయ్య గారి తండ్రి నిన్న అనారోగ్యంతో మృతి చెందగా , గురువారం పిచ్చయ్య గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన వార్డ్ మెంబర్ నుకపంగు మల్లయ్య గారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గారు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. నూకపంగు మల్లయ్య కుటుంబ సభ్యులకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ను అందజేశారు. ఈరోజు ఉదయం గ్రామానికి చెందిన కట్టెకొల లక్ష్మయ్య గారు మృతి చెందగా మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్ కుమార్, ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు దేవభక్తుని సురేష్, ఒంటిపులి నాగరాజు, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తవనం వెంకటరెడ్డి వట్టికూటి శ్రీనివాస్, ఈదయ్య, తదితరులు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.