వానాకాలం సాగు పంటల ప్రణాళిక జిల్లా సదస్సు కరపత్ర ఆవిష్కరణ

జనగామ జిల్లా కేంద్రంలోని పూసల భవన్ లో జూన్ 4వ తేదీన మారుతున్న పరిస్థితుల్లో వానాకాలం సాగు పంటల ప్రణాళిక జిల్లా సదస్సుకు *ముఖ్యఅతిథిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రముఖ వాతావరణ శాఖ నిపుణులు ప్రొఫెసర్ దండ రాజి రెడ్డి గారు హాజరుకానున్నారు కావున ఈ సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనక రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం రోజున ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో జనగామ జిల్లా కేంద్రంలోని పూసల భవన్లో జూన్ 4వ తేదీన జరుప తలపెట్టిన మారుతున్న పరిస్థితుల్లో వానాకాలంపంటల ప్రణాళిక జిల్లా సదస్సు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కనక రెడ్డి మాట్లాడుతూ…. మన దేశంలో దాదాపు 65 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి పూర్తిగా రుతుపవనాలు వర్షపాతం నమోదుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని ఒకే పంట విధానం కాకుండా బహుళ రకాల పంటలు, సమీకృత వ్యవసాయం, పశుసంపద, ఉద్యానవన పంటలు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలు పంటలు వేసుకోవాలని, మార్కెట్లో ధరల స్థిరీకరణ గా ఉన్నటువంటి పంటలను ముఖ్యంగా గొర్ల పెంపకం, మత్స్య సంపద ,కంది, పెసర, శనగలు ,మినుములు, మొక్కజొన్న ,చిరుధాన్యాలు, సోయాచిక్కుడు, వేరుశనగ ,ఆముదం ,కుసుమలు, కోళ్ల పరిశ్రమ, వంటి పంటలను వేసుకోవడం ద్వారా లాభసాటి గా ఉండి రైతుల ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉంటుందని, కూలీల కొరతను అధిగమించడానికి యాంత్రీకరణ ప్రోత్సాహానికి రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, విత్తనాలు ఎరువులు సహకార సంఘాల ద్వారా సబ్సిడీపై ఇవ్వాలని, పాల రైతులకు ఇన్సెంటివ్ ఇచ్చి ప్రోత్సహించాలని ,కూరగాయలను వేసుసుకునే విధంగా రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రైతు వేదికల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా చందు నాయక్ జిల్లా కమిటీ సభ్యులు మంగ బీరయ్య,కర్రె రాములు, కర్రె బిరయ్య, కోయల్ కార్ శివ,తూటి దేవదానం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.