ఆందజేస్తున్న ఎంఎల్ఎ జగన్మోహన్ రావు
వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది.
నందిగామ పట్టణంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు తెలిపారు.
నందిగామ నియోజకవర్గంలోసుమారు 2,500 మంది వాలంటీర్లప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మధ్య వారధిలా గా పని చేస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు .
అలాంటివారికి ఉత్తమ పురస్కారం వాలంటీర్ల గా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మంగళవారం కార్యక్రమంలో పాల్గొని వాలంటరీ లను సత్కరించి వారికి చెక్కులను పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండవ వరలక్ష్మీ, వైస్ చైర్మన్ నాగరత్నం, నాలుగు మండలాల తహశీల్దార్లు ఎంపిడివోలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు, పార్టీ మండల, గ్రామ నాయకులు,కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
