వాహనదారులు అంత తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని భద్రాచలం asp రోహిత్ రాజ్ అన్నారు. భద్రాచలంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ పి వి ఎన్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై కొత్తగా వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ వి ఎన్ రావు ప్రెస్టేజ్ గా తీసుకొని డ్యూటీ నిర్వహిస్తున్నారని అన్నారు.
ప్రతిరోజు తప్పనిసరిగా 5 పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుబడుతున్నయనీ తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు దొరుకుతున్నాయని అన్నారు. సౌండ్ పొల్యూషన్ చేసే సైలెన్సర్ లు, రేష్ డ్రైవింగ్ వాహనాలు పట్టుబడుతున్నాయి అని అన్నారు.
విలేకరులు కాకుండా ఎవరైతే వాహనాల మీద ప్రెస్ అని రాసుకొని తిరుగుతున్నారో వారి వివరాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
భద్రాచలం డివిజన్ లో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరో ఒకరు మృతి చెందుతున్నారని అన్నారు.
ప్రయాణికులంతా హెల్మెట్ పెట్టుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని తెలిపారు.