వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్

రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలి

(వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్.)

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18న ప్రవేశపెట్టే బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించాలని, వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి మోడల్ కాలనీలు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలిపారు.

దివి: 16-03-2020 మంగళవారం రోజున Nprd జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని R.D.O కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా అనంతరం Rdo మధుమోహన్ గారికి వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వనైనది. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18న ప్రవేశపెట్టే బడ్జెట్లో వికలాంగుల సంక్షేమం కోసం 5 శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. కేటాయించిన నిధులను వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో 2016 చట్టం ప్రకారం 5 శాతం కేటాయించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పట్టణ కేంద్రాలలో వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి మోడల్ కాలనీల ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి సంవత్సరం కేటాయించిన బడ్జెట్లో నిధులు ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్ళీ ఇస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 9 జాతీయ విద్య సంస్థలను విలీనం చేయాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, మహిళా వికలాంగుల సమస్యలపై మార్చి 18న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా Nprd అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధరన్, ఉపాధ్యక్షురాలు ఝాన్సీరాణి, హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల చైర్మన్ పటాన్ ఉమ్మర్ఖాన్, సీమాన్ డైరెక్టర్ గురు ప్రసన్న లక్ష్మి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు T.జ్యోతి, Nprd జాతీయ అధ్యక్షులు M.జనార్దన్ రెడ్డి, ప్రముఖ రచయిత స్ఫూర్తి హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా వేలాది మంది వికలాంగులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ(RPD)చట్టం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. 1992 తర్వాత వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విద్యా, ఉద్యోగాల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగులకు కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవేటు రంగంలో వికలాంగులకు 5 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వికలాంగులైన విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలిపారు. దేశంలో మహిళా వికలాంగులపై వేధింపులు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు. మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలని అన్నారు. వికలాంగులపై జరుగుతున్న వివక్షత అన్యాయాలు, అవమానాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వికలాంగులకు ఓకే పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 40 శాతం వైకల్యం ఉన్నా వికలాంగుల అందరికీ పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రతి నెల పింఛన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పింఛన్ల మీద ఆధారపడిన వికలాంగుల కుటుంబాలు, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగుల కోసం జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి రుణాల కోసం వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే మండలానికి ఒక యూనిట్ చొప్పున రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దరఖాస్తుల కనుగుణంగా యూనిట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో వికలాంగులకు విద్యావకాశాలు తగ్గిపోతున్నాయనీ అన్నారు. మార్చి 18,19 తేదీల్లో హైదరాబాద్ పట్టణంలో ఎన్పిఆర్డి కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా వికలాంగుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో Nprd మహిళ కన్వీనర్ బండవరం శ్రీదేవి, Nprd పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కానుగు బాలనర్సయ్య, ఉప్పరి వేణు, Nprd మండల అధ్యక్షులు మాలోతు రాజ్ కుమార్, లతోపాటు వికలాంగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.