విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోని ఉపాధ్యులకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ స్టేట్ ఆర్.టి.ఐ కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ సూచించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 తరగతిలో గ్రేడ్ పాయింట్ ఆవరేజ్ జిపిఏ 10/10 సాధించిన విదయ్యార్ధులకు అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మెమోంటోలు అందచేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేట్ స్థాయి పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10/10 సాధించి చరిత్ర సృష్టిచారన్నారు. ఇదే ప్రతిభను చాటుతూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎఎస్పి యోగేష్ గౌతమ్, సేవా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
