విద్యార్దులు ఉన్నత లక్ష్యాలు సాధించడానికి కష్టపడి చదవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి క్ర్రష్ణయ్య అన్నారు.
ప్రతిభ జూనియర్ కాలేజి 13 వ వార్షికోత్సవం పబ్లిక్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి క్ర్రష్ణయ్య, కళాశాల కరస్పాండెంట్ వెంకట రెడ్డి, వ్యవస్థాపకులు నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐఇవొ క్ర్రష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రతిభ కనపరిచి ఉన్నత స్ధానాలకు చేరుకోవాలని అన్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ సీటు విద్యార్థుల లక్ష్యంగా వుండేదని కాని నేడు చాలామంది విద్యార్థులు ఐఎఎస్, ఐపిఎస్ లను సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదువుతున్నారని అన్నారు. విద్యార్దులు ఎప్పుడూ పోటి పరీక్షలలో విజయం కొరకు సాధన చేయాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యం బాబు మాట్లాడుతూ 2009 నుండి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో మొదటి నాలుగు, ఐదు స్థానాలలో నిలిచారని అన్నారు. ఎమ్ సెట్, ఇంజనీరింగ్ లతో పాటు ఐఐటి జెఈఈ అడ్వాన్స్ పరీక్షలతో పాటు ఎన్ ఐటి లో కూడ తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. కళాశాల విద్యార్ది కార్తిక్ ఐఐటిలో 250 ర్యాంక్ సాధించి ఐఐటి జలంధర్ లో చదువుతున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
