#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS
  • చిన్న వయస్సు నుంచే సామాజిక కోణంతో సృజనాత్మకంగా అలోసించాలి
  • ఇంటర్నెట్ అనేది జ్ఞాన పొందడానికే వినియోగించాలి.
  • పిల్లలు వాహనాలు నడపడం నేరం
    …అడిషనల్ ఎస్పీ రితిరాజ్ IPS.

కోదాడ రూరల్ పరిధి నేమలిపురి కాలనీలో గల ప్రభుత్వ గురుకుల పాఠశాల నందు సామాజిక అంశాలు, షి టీమ్స్, మహిళా, విద్యార్థుల బరోసా, సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్రభావం, మాదకద్రవ్యాల నిర్మూల పలు అంశాలపై ఈరోజు కోదాడ రూరల్ పోలీసు లు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు పోలీసు అధికారి రితిరాజ్ IPS గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సక్సెస్ సలహాలు, సూచనలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధనపు ఎస్పీ గారు మాట్లాడుతూ విద్యార్థులు నేర ప్రవృత్తి కి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాల గురించి తెలిపినారు. విద్యార్థులు సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ తరగతులు మాత్రమే వీక్షించాలని ఇంటర్నెట్ ను జ్ఞాన సముపార్జనకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆన్లైన్ పేయింగ్ గేమ్స్ అదొడ్డు, నగదు ఉపసంహరణలు, అపరిచితులు పంపే లింకులు అనుసరించవద్దు అని తెలిపినారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల మాయలో పడొద్దు. విద్యార్థులు వాహనాలను నడప రాదని మైనర్లకు వాహనాలు నడిపే హక్కు ఉండదని తల్లిదండ్రులకు తెలియకుండా వాహనాలు బయటికి తీసుకొచ్చి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

బాల్యం నుండే చదువు, ఇతర అంశాలపై సామాజిక కోణంలో సృజనాత్మకంగా ఆలోచన చేయాలని సూచించారు. నిత్యం కృషి చేస్తే సక్సెస్ తపక వస్తుంది అన్నారు.

విద్యార్థినిలకు ఆపద సమయంలో రక్షించడానికి షీ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని అవి నిర్వర్తించే విధులను వివరించారు. ఫోక్సో చట్టాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నాగదుర్గ ప్రసాద్, సి టీం ఎస్ ఐ మౌనిక, రజిత, రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్, సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ,అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.