ఈ69వార్త జఫర్ఘడ్/ ఏప్రిల్1
మండలంలోని తిమ్మంపేట గ్రామంలోని ఎస్ ఎస్14 ట్రాన్స్ ఫార్మర్ 100హెచ్ పి పరిది కింద 28అనుమతి పొందిన విద్యుత్ మోటార్ పంపులు నడుస్తున్నాయి.ఇట్టి ట్రాన్స్ ఫార్మర్ లోడ్ కు మించి నడుస్తున్నది.ఈ విషయంపై గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న నాధుడు లేడు.వరి పంట చేతికి వచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్ నందు వచ్చిన సాంకేతిక లోపం కారణంగా 20మంది రైతుల విద్యుత్ మోటార్లు కాలినవి.ఆరు గాలం కష్టపడ్డ రైతులు పంటచేతికొచ్చే సమయంలో ఈ విదంగా మోటార్లు కాలడంతో లబోదిబోమంటున్నారు. ఇప్పటికయినా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే మరో ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసి,ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే రిపేర్ చేయాలని బాధిత రైతులు గాదె వెంకట్ రత్నం,ఇల్లందుల నాంపల్లి,ఇల్లందుల రామచంద్రు,అంగడి వెంకటయ్య,మారపాక అశోక్,సజన్,గుంటి సంపత్,గుంటి కుమార్,ఇల్లందుల సుదర్శన్,మారపాక తిరుపతి,అంగడి సారయ్య,అంగడి సురేష్ ,తాళ్లపల్లి ఆనందం,శ్రావణ్ మున్నగు రైతులు కోరుతున్నారు.
నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించి కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనచేపడతామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల ఐలయ్య విద్యుత్ అధికారులను డిమాండు చేసినారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.