విద్యుత్ షాక్ తో కాడెద్దు మృతి చెందిన ఘటన మరిపెడ మండలంలోని డి ఎస్ ఆర్ జండాల తండా శివారు కోమటికుంట తండాలో బుధవారం జరిగింది. విద్యుత్ షాక్ గురై లక్ష రూపాయల విలువ గల కాడెద్దు మృతి చెందడం పట్ల రైతు గుగులోతు దస్రు నాయక్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వ్యవసాయంపై ఆధారపడ్డ తనకు నష్ట పరిహారం అందించాలని రైతు వేడుకున్నాడు