mahabubabad news

విద్యుద్ఘాతంతో కాడెద్దు (కోడే) మృతి చెందిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత రైతు బీసు ఎల్లయ్య తెలిపిన కథనం ప్రకారం తన కోడే రోజు మాదిరిగానే మేత కోసం వెళ్లి మేస్తుండగా గ్రామ పంచాయితీ మంచినీళ్ళ బావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తెగి పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపాడు. సుమారుగా రూ. 60వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామానికి మంచినీళ్లు అందించే నల్లాల బావి వైర్లను నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. దీనికి పూర్తిగా గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద కరెంటు స్తంభాల నుండి వెళ్లే మెయిన్ లైన్లో చాలా చోట్ల కిందికి వేలాడుతున్నడంతో రైతులు విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కొత్త స్తంభాలు వేయకపోవడంతో వర్షాకాలంలో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లుపు లైన్లను సవరించాలని కొత్త స్తంభాలను వేయాలని స్థానిక రైతులు కోరుకుంటున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.