విద్యుదాఘాతంతో లేగ దూడ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వాల్య తండా గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం. వాల్యతండాకు చెందిన రైతు తేజావత్ జామకు చెందిన తన లేగ దూడను మేత కోసం వ్యవసాయక్షేత్రం వద్దకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వర్షాలకు, ఈదురుగాలుల కారణంగా తండా శివారు పాలేరు వాగు సమీపంలో గాలివానకు తెగి బడ్డ లెవన్ కేవీ విద్యుత్ తీగకు తగిలి లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది.