విద్య రంగం లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి


ఉపాధ్యాయుల ఒక్క రోజు దీక్షను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జాక్టో, యు.ఎస్.పి.సి. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక్క రోజు దీక్షను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో అత్యంత నిరాదరణ కు గురైన విద్య రంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందని ముఖ్య మంత్రి హోదాలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక విద్య రంగం దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్రం లో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని అనడం సమంజసం కాదని
తక్షణమే అప్ గ్రేడ్ పండిట్ పి. ఇ.టి.లతో సహా అన్ని కేటగిరీలో ప దొన్నతలు కల్పించాలి,
పదోన్నతుల తో పాటే సాధారణ బదిలీలు నిర్వహించాలి
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు నిర్వహించాలి
అంతర్ రాష్ట్ర అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి
పాఠశాల లలో కలిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.