మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడండి సంత్ గాడ్గే బాబా 146 వ జయంతి వేడుకలు ఈరోజు ఉదయం రహ్మత్ నగర్ డివిజన్ ఎస్ పి ఆర్ హిల్స్ లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జోన్ కార్యదర్శి జి బిక్షపతి సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడారు గాడ్గే బాబా జీవితాంతం ప్రజల కోసం, వెనుకబడిన తరగతుల కోసం సేవే మార్గం తన కీర్తనలతో చైతన్యపరిచే వారు అంటరాని వారిని ,కుష్టి వ్యాధి వారిని దగ్గరికి తీసుకొని సేవ చేశాడు ఏదైనా ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామం మొత్తం రోడ్లన్నీ శుభ్రం చేసి జీవితాంతం స్వచ్ఛభారత్ దేశంలో మొదటిసారిగా నిర్వహించిన మేధావి ప్రజల అందరికీ విద్య అవసరమని విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుందని పాఠశాల లు కట్టించారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా మనుషులంతా సమానమే అనే నిస్వార్ధంగా సేవ చేసిన ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం నాయకులు కె సుధాకర్, అశోక్ ,సిఐటియు నాయకులు ఏ ఆర్ నరసింహ, భాగ్యరాజు, లక్ష్మణ్, సత్యనారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడండి