cng news hanumakonda news

డీసీసీ భవన్ హన్మకొండ..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం..

నేడు హన్మకొండ కాంగ్రెస్ భవన్ పత్రిక విలేకర్ల సమావేశం లో వరంగల్ & హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నందున రాష్ట్ర విభజన చట్టం లో తెలంగాణకు ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరియు విభజన హామీలపై నిలతీయండి అని గాంధేయమార్గం లో నిరసన తెలియ చేయటానికి ర్యాలీ గా వెలుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై బీజేపీ నాయకులూ అకస్మాత్తుగా బొంగు కర్రలతో, రాడ్ లతో మా పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి లో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ని పరామర్శించిన వరంగల్ & హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి. బీజేపీ నాయకుల వైఖరిని ప్రజాస్వామ్య వాదులు అంతా ఖండించాలని కోరారు.

మోడీ గో బ్యాక్.. అమిత్ షా గో బ్యాక్.. నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ, రాష్ట్ర విభజన చట్టంలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మరియు విభజన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ కు వస్తున్న మోడీ, అమిత్ షా లు గో బ్యాక్ అంటూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అదాలత్ హంటర్ రోడ్ చౌరస్తా లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు లాటి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బిజెపి గుండాలు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెరాస, బిజెపి ఆడుతున్న దొంగ ఆటలో రాష్ట్ర విభజన హామీలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై నీరు కార్చారని తెలంగాణ బిజెపి నాయకులకు సిగ్గు శరం ఉంటే మహారాష్ట్రకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎలా వెళ్ళింది అని ప్రశ్నించారు. తెరాస, బిజెపి ప్రభుత్వాలకు తొందర్లోనే ప్రజలు చెరమ గీతం పాడతరని, విభజన చట్టంలోని పరిశ్రమలను తేవడానికి చాతగానీ దద్దమ్మలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో వరంగల్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలని, వరంగల్ పశ్చిమ MLA కాజీపేట రైల్వే ఉద్యమాల పేరు మీద పేలాలు ఏరుకోడం తప్ప చిత్త శుద్ది లేదని ఎన్నికలు సమిపిస్తెనే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం అఖిల పక్షాల పేరుతో గుర్తస్తుందని విమర్శించారు. నిరసన తెలియచేస్తూనా కాంగ్రెస్ కార్యకర్తలపై, నాయకులపై, జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులంతా తీవ్రంగా ఖండిచాలని రాష్ట్ర విభజన హామీలపై నడుం బిగించాలని కోరారు. జిల్లా ప్రజలందరు విభజన హామీలు సాధించుకునే ఉద్యమంలో గాంధేయ మార్గంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంటేస్టెడ్ యం.పి దొమ్మటి సాంబయ్య, మహిళా అధ్యక్షురాలు బంక సరళా, మైనారిటీ అధ్యక్షులు ఆయుబ్, యస్. సి సెల్ అధ్యక్షులు.పెరుమాండ్ల రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు గుంటి స్వప్న, కత్తుల కవిత, గాండ్ల స్రవంతి, మేరీ‌ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,డివిజన్ ప్రెసిడెంట్లు , తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.