ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపిన ఏపీఎస్ యూ సభ్యులు.

అనంతపురం నగరానికి చెందిన CVR న్యూస్ రిపోర్టర్ సుజేంద్ర తనకు తెలిసిన వాళ్ల వ్యక్తి ఆచూకీ కనబడటంలేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే…. అక్కడ ఉన్న కానిస్టేబుల్ నరేష్ రిపోర్టర్ పై దురుసుగా ప్రవర్తించాడు. రిపోర్టర్ అని చెప్పినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడటంతో రిపోర్టర్ సుజేంద్ర, ఏపీఎస్ యూ మిత్రులు ఎస్పీకి వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఎస్పి ఖచ్చితంగా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విచారణ చేసి కానిస్టేబుల్ నరేష్ పై చర్యలు తీసుకోవాలని మూడో పట్టణ సీఐ హరనాథ్ ఆదేశాలు జారీ చేశారు. రిపోర్టర్లు ఇచ్చిన వినతికి స్పందించినందుకు రిపోర్టర్లు అందరూ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.