AMJ ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం

-AMJ ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం

E69News:-ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు (50) యాబై సంవత్సరాల క్రితం దాదాపు 30 గ్రామాలలో అహ్మదీయ ముస్లిం జమాఅత్ స్థిరపడి ఉంది.
అహ్మదీయ ముస్లిం జమాఅత్ సభ్యులకు గత యాభై ఏళ్ల క్రితం ఇస్లాం ధర్మం గూర్చి ఏమి తెలియకుండెను.కల్మా లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్, మరియు నమాజ్ సాంప్రదాయ పద్ధతులు, మనిషి చనిపోతే ఖననం చేసే పద్ధతి,రోజా ఉపవాస దీక్ష ఆచారాలు,తదితర ఇస్లాం సాంప్రదాయ పద్ధతులు,తెలియక తెలిపే వారు లేక నామ మాత్రపు ముస్లిం పండితుల పై పూర్తిగా ఆధారపడి ఉండేవారు.వారి హేళనకు గురయ్యేవారు.ఈ తరుణంలోనే భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం, గురుదాస్ పూర్ జిల్లా, ఖాదియాన్ గ్రామంలో 1889 సంవత్సరం లో సర్వ ధర్మ కలియుగ అవతార పురుషునిగా మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం అవతరించి అహ్మదీయ ముస్లిం జమాఅత్ ను స్థాపించి సర్వ ధర్మ బోధనలను ముఖ్యంగా “నిజమైన ఇస్లాం” బోధనలు ప్రచారం చేస్తున్న తరుణంలో మొదట వరంగల్ జిల్లా లోని రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో, మౌల్వీ ముహమ్మద్ సత్తార్ సాహెబ్ కొండూరి గారి ఆధ్వర్యంలో అహ్మదీయ మౌల్వీల(పండితులు) ద్వారా అహ్మదీయ ముస్లిం జమాఅత్ ఏర్పాటు చేసి ఇస్లాం బోధనలు నేర్చుకొని, తద్వారా జిల్లాలోని వివిధ గ్రామాలలో అహ్మదీయ్యత్ ను స్థిరపరచి “నిజమైన ఇస్లాం”బోధనలు నేర్పి ఆచరింపచేస్తున్నారు.అహ్మదీయుల అభివృద్ధిని జీర్ణించుకోలేక, ఓర్వలేక అహ్మదీయేతర నామ మాత్రపు ముస్లిం ఉలెమాలు(పండితులు) ప్రారంభం నుండే అహ్మదియ్యత్ కు వ్యతిరేకంగా దుష్పచారం చేయసాగారు.ఎన్నో ఎత్తుగడలు, ఎన్నో అపవాదాలు, ఎన్నో అరాచకాలతో అహ్మదీయ అభివృద్ధిని అడ్డుకోవడాని ప్రయత్నాలు చేసి ఓడి పోయి అలసిపోయి,కొన్నాళ్ళు తోక ముడుచుకొని ఉన్నారు.మళ్ళీ ఒక పన్నాగం పన్నారు.అదీ “అహ్మదీయుల వివాహ సంబంధాలు చెడగొట్టడం”
అమాయక అహ్మదీయులను వత్తిడి చేసి మానసికంగా కృంగతీసి తమ వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
దానికి ప్రతీకారంగా వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సలీం తెలిపారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.