వివిధ పార్టీల నుండి తెరాసలో చేరిన మైనార్టీ యువత

E69 న్యూస్..
పరకాల నియోజకవర్గ…

వివిధ పార్టీల నుండి తెరాసలో చేరిన మైనార్టీ యువత…

పరకాల మున్సిపల్ పరిధిలోని కో అప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమ హమీద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 30 మందికి పైగా మైనారిటీ యూత్ కార్యకర్తలు తెరాసలో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ తెరాస పార్టీ విధివిధానాలు నచ్చే పార్టీలో చేరుతున్నారన్నారు.
తెరాస పై నమ్మకంతో పార్టీలో చేరిన
ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగిన అందుబాటులో ఉండి ఆదుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.