విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కువిశాఖ ఉక్కు త్యాగాలకు ప్రతీక

అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య, మరియు సిపిఐ, సిపిఎం పార్టీలు మరియు జై హనుమాన్ ట్రావెల్స్ యూనియన్ (CITU)AIRTWF సంఘాలు ఆధ్వర్యంలో …..
ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి రాచేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం సాగిన ప్రజా ఉద్యమంలో 32 మంది బలిదానం అయ్యారు అంటే విశాఖ ఉక్కు త్యాగాల ప్రతిక. వారి త్యాగాలకు దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఇందిరా గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ఆంధ్రుల మనోభావాలను గౌరవించి విశాఖ ఉక్కు స్థాపనకు సహకరించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎందరో రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. తమ భావితరాలకు బంగారు భవిష్యత్తు కోసం లక్షల కోట్లు విలువైన పంట భూములను త్యాగం చేశారు. అటువంటి విశాఖ ఉక్కు ప్లాంట్ కేవలం నష్టాలను సాకుగా చూపి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ లకు కట్టబెట్టేందుకు దిగజారడం దారుణం. ఎందరో త్యాగాల ఫలం విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇది కేవలం పరిశ్రమ కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెచప్పుడు అటువంటి పరిశ్రమను కాపాడుకునేందుకు ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, నాయకులు అనిమిరెడ్డి, నాగరాజు, లచ్చి, ప్రసాద్ మరియు జై హనుమాన్ ట్రావెల్స్ యూనియన్ అధ్యక్షులు శివ ప్రసాద్, కార్యదర్శి బీమా చౌదరి, నారాయణస్వామి, రాహుల్, మల్లి, సూరి, ప్రేమ్ కుమార్, అంజి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.