విశ్వ మానవ శ్రేయస్సు కోసం విశాల హృదయాన్ని ఆవిష్కరించిన సామాజిక విప్లవ కవితామూర్తి విశ్వనరుడు, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని ప్రముఖ కవి రచయిత సాగర్ల సత్తయ్య అన్నారు.

కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం అధ్వర్యంలో కవి గుర్రం జాషువా 126 వ జయంతి ని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున అధ్యక్షత న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాగర్ల సత్తయ్య మాట్లాడుతూ ఆధునికులైన పద్య కవులలో అగ్రశ్రేణి కవి జాషువా అన్నారు. భావ కవిత్వం ఉద్యమంగా సాగుతున్న రోజులలో భావ కవిత్వాన్ని కాదని సామాజిక సంస్కరణాభిలాషతో కవిత్వాన్ని రాసిన ధీశాలి జాషువా అన్నారు.
19వ శతాబ్దం లోనే సమాజంలోని కుల వివక్షను ఎదిరించి కులాంతర వివాహం చేసుకొని కులం కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడన్నారు. ఎదురైన అవమానాలను సవాలు గా తీసుకొని తన కలంతో సమాజంలోని దురాచారాలపై తిరుగుబాటు చేశాడన్నారు. వర్గ సంఘర్షణ ఆర్ధిక వ్యత్యాసాల నిర్మూలన దోపిడి వర్గాల పై నిరసన జాషువా కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. అంధ విశ్వాసాలను మత విద్వేషాలను తీవ్రంగా నిరసించాడు.
ఈ విధంగా కుల వ్యవస్థను హెచ్చుతగ్గులు నిచ్చెనమెట్ల సమాజాన్ని వర్ణవ్యవస్థను జాషువా తీవ్రంగా నిరసించాడు.
జాషువా తన జీవితమంతా కులవివక్షను అవమానాలను అడుగడుగునా ఎదుర్కొన్నాడు. ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదవగా అంటరాని వారిని సభ లోకి ఎందుకు అనుమతించారు అంటూ కొంతమంది అగ్రవర్ణ పండితులు సభనుండి వెళ్ళిపోవడం జాషువా మనసును తీవ్రంగా గాయపరిచింది.
దేశంలో ఆకలితో అలమటించే వారి కంటే విగ్రహాలకు పెళ్లిళ్లు చేయడానికే సంపద ను వెచ్చిస్తున్న సమాజ పోకడలను జాషువా తీవ్రంగా ఆక్షేపించేవారన్నారు.

చరిత్ర ఆధ్యాపకులు లింగమూర్తి మాట్లాడుతూ తనకు జరిగిన అవమానాలకు పనితోనే.సమాధానం చెప్పేవారు అన్నారు. వెలిబుచ్చారు. జాషువా కు ఎక్కడ అవమానాలు జరిగాయో అక్కడే తన అసమాన ప్రతిభ సంపత్తి చేత సన్మానాలు అందుకున్నారు.అలా ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ,భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ లాంటి ఉన్నత పురస్కారాలు అందుకున్న ఘనత జాషువ ది అన్నారు.

కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండేటి శ్రీను పాలడగు నాగార్జున మాట్లాడుతూ జాషువా కులాన్ని నిరసించాడేగానీ కులవాదిగా మారలేదన్నారు.అతని కవిత్వం లో బాష బావం జమిలిగా నడుస్తూ పాఠకులను వెంట తీసుకేల్తాయన్నారు. ప్రకృతి వర్ణనలో జాషువా శైలి ముచ్చట గొల్పుతుంధన్నారు.ఒక మానవతావాది గా,ప్రకృతి ఆరాధకుడిగా మానవ శ్రేయస్సు ను కాంక్షించిన జాషువా కు తెలుగు సాహితీ లోకంలో ప్రత్యేక స్థానం ఉంధన్నారు.

ఈ జయంతి కార్యక్రమంలో కవి రచయిత డాక్టర్ లేఖనందస్వామి , యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, డిటిఎప్ జిల్లా అధ్యక్షుడు పి. వెంకులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య , మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్ , ప్రముఖ కవులు బండారు శంకర్,దేవాదానం, సంతపురి నారాయణ రావు, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పర్శరాములు ,జిట్టా నగేష్ ,పనికర కృష్ణమోహిని , గాదె నర్సింహ , బొట్టు శివకుమార,దోంతాల నాగార్జున , బొల్లు రవీందర్,అజయ్ కుమార్,దండు రవి , బొంగరాల వెంకులు, దైదా జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.