వీఆర్ఏలకు పేస్కేల్ వెంటనే విడుదల చేయాలి-బొజ్జపల్లి

ధర్మసాగర్ బిజెపి మండల అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి గారి ఆహ్వాన మేరకు వీఆర్ఏలకు మద్దతు తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు

ఈరోజు ధర్మసాగర్ మండలం తహిసిల్దార్ కార్యాలయం వద్ద VRA ల నిరవధిక సమ్మెకు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జ పల్లి సుభాష్ గారు బిజెపి శ్రేణులతో కలిసివేల్లి సంఘీభావం తెలిపిన అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2017 లో ప్రగతిభవన్ వేదికగా 2020 – 2022 సంవత్సరంలో రెండు సార్లు నిండు శాసన సభలో VRA లకు పే స్కెల్ జిఓ అమలు చేస్తానని ఆర్వులైన VRA లకు ప్రమోషన్ ఇస్తానని 55 ఏండ్ల పైబడి ఉన్న VRA ల స్థానంలో వారి వారసులకు ఉద్యోగం కల్పిస్తామని VRA లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానని మాట్లాడి చెప్పిన హామీలు నెరవేర్చలేని పక్షంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరుపున వీఆర్ఏలకు మద్దతుగా పోరాటం చేస్తామని అన్నారు…

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఓబిసి మోర్చ జిల్లా జనరల్ సెక్రెటరీ గాజుల సంపత్ కుమార్, బిజెపి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు పూల శ్రీనివాస్ గారు గార్లతో పాటుగా VRA ల మండల సంఘం అధ్యక్షులు గుండు రాజుకుమర్ ఉపాధ్యక్షులు తాటికాయల ఆరోగ్యం, ప్రధానకార్యదర్శి వేములకొండ కుమారస్వామి, కోసాధికారి పెసర శ్రీనివాస్, సంఘం ప్రతినిధులు పెసరు హరీష్, లింగయ్య ,సారంగపాణి, రాజకుమార్ ,స్వాతి ,శ్వేత, వెన్నెల తదితరులు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.