ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 27
జాఫర్ గఢ్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న వీ.ఆర్.ఏ ల నిరాహారదీక్ష కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గాంగారపు అమృతరావు పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల ఉద్యమం న్యాయమైనది, గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ పరమైన ప్రతి సమస్యను గుర్తించి ప్రభుత్వానికి తెలియచేయడంలో వారి పనితనం విలువైనది, గొప్పది అని అన్నారు. అదేవిదంగా గతంలో కేసిఆర్ నిండు అసెంబ్లీలో వీఆర్ఏ లకు పే స్కెల్ వర్తింపచేస్తామని చెప్పి ఈరోజు వరకు అమలు చేయలేదు,మరియు ఆకస్మికంగా వీఆర్ఏ ఎవరైనా మరణించినట్లయితే వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని,25 లక్షల ఎక్సగ్రేషియా ఇవ్వాలని, వీఆర్ఏలలో అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, కేటీఆర్ ఓటిటి లల్లో సైనిమాలను చూడడం మానేసి విఆర్ఎల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న23000 మంది విఆర్ఎలకు ఎల్లవేళల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నూకల ఐలయ్య మాజీ జడ్పీటీసీ పట్టపురి సదయ్య గౌడ్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్ జిల్లా నాయకులు మామిడాల సోమనారాయణ తదితరులు పాల్గొన్నారు.