సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తమ మొండి వైఖరి విడనాడి వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు మరిపెడ మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా వీఆర్ఏలు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని సిపిఐ బృందం సందర్శించి వారికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా వీఆర్ఏలను ఉద్దేశించే నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్ఏల పట్ల ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబించడం అన్యాయమని వారికి హామీ ఇచ్చినట్లుగా పే స్కేలు వెంటనే అమలు చేయాలని పదోన్నతులు కల్పించడంలో నిర్లక్ష్యం విడనాడాలని వారసత్వ ఉద్యోగాల కల్పనకు పూనుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
రెవిన్యూ వ్యవస్థ కుప్పకూలిపోయిందని ధరణి ఒక జడ పదార్ధంగా మారిందని దీనితో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని ఉద్యోగస్తుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని” కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా “రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఉందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్ ,మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ,అబ్దుల్ రషీద్ వీఆర్ఏల సంఘ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.మరిపెడ లో జరుగుతున్న వి.ఆర్.ఏ ల శాంతియుత నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించిన మహబూబాబాద్ ట్రేసా జిల్లా ప్రెసిడెంట్ -రంజీత్ కుమార్
జిల్లా ప్రధాన కార్యదర్శి-పి.రాంప్రసాద్ తహసిల్దార్ మరిపెడ ట్రెసా జిల్లా కార్యవర్గ సభ్యులు.త్వరలోనే వి.అర్.ఏ ల సమస్యలు పరిష్కారం అవ్వాలి అనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.