-వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • టీపీసీసీ మాజీ సభ్యులు సోమేశ్వరరావు

ఈ69 తొర్రూరు జులై 27:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు విమర్శించారు.తొర్రూరు డివిజన్ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల జాక్ ఆధ్వర్యంలో చేపడుతున్న 3వ రోజు నిరవధిక దీక్ష శిబిరాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి వీఆర్ఏలకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలతో వెట్టి చాకిరి చేయించి వారి శ్రమను ప్రభుత్వం దోపిడి చేసి వారి సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం కేసీఆర్ నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. వీఆర్ఏల పే స్కేల్ జిఓను విడుదల చేయాలని,అర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్ లు కల్పించాలని,55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,విధుల్లో మరణించిన వీఆర్ఏ వారసులకు కారణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు చేస్తున్న పోరాటాలకు అండదండగా ఉండి సమస్యలు పరిష్కరించేంత వరకు తోడుగా ఉంటామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కందాడి అచ్చిరెడ్డి, కోటగిరి సుదర్శన్, తాళ్ల పెళ్లి బిక్షం గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్,ఎన్,ఎస్ యు,ఐ నియోజకవర్గ అధ్యక్షుడు బసనబోయిన రాజేష్ యాదవ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.