ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడాలి
జిల్లా కాంగ్రెస్ నేత నాగ సీతారాములు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ..
సుజాతనగర్ మండలం కేంద్రంలో సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం వీఆర్ ఏలు చేస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ నేత నాగ సీతారాములు తమ సంఘీభావాన్ని తెలిపారు. గత 6 రోజులుగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల నిరవధిక సమ్మె చేపట్టిన ప్రభుత్వం స్పందించని విషయం తెల్సిందే. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన వీఆర్ఏ లకు మనోధైర్యాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు గత 6 రోజులుగా నిరవధిక సమ్మెలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే వీఆర్ఏలు అడుగుతున్నారని ఇప్పటికైనా నిరంకుశ ప్రభుత్వం స్పందించి వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, విద్యా అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈకార్యక్రమములో సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి.రాజశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మడిపల్లి. శ్రీనివాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లాభక్షి తది తరులు పాల్గొన్నారు.ఈ69 న్యూస్ రిపోర్టర్ యాకోబు