వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి-పాలడుగు నాగార్జున

ఎండనకా వాననకా రేయింబవళ్లు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వీఆర్ఏలకు ప్రభుత్వం పే స్కేలు జీఓ ను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.
ఈరోజు నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ ఏ లా మూడవ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడడం జరిగింది.. ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని అన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయినా వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగం 5 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు వెంటనే ఇచ్చి అమలు జరిగే విధంగా ప్రయత్నించాలని కోరారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం జరిగేవరకు సీపీఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతుందని అన్నారు. ఓడా ఎక్కినాక ఓడమల్లయ్య దిగినాకా బోడి మల్లయ్య సామెత గుర్తుకు వస్తుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ దీక్ష లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండా అనురాధ సిపిఎం నల్లగొండ మండల కార్యదర్శి నలపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు కొండా వెంకన్న, బొల్లు రవీందర్ కుమార్ వీఆర్ఏల మండల అధ్యక్షులు దేశ గానీ నర్సింహా, బాలస్వామి, మారయ్య ,నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.