వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భూపాల పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. వీఆర్ఏ లు రేగొండ మండల కేంద్రం లోని తహశీల్దారు కార్యాలయంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టగా, వారి దీక్షలకు గండ్ర సత్యనారాయణ రావు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
వీఆర్ఏ లు రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కింది స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని అమలు చేసే క్రమంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారని అన్నారు. అత్యంత తక్కువ జీతం తోనే కొన్నేళ్లుగా పని చేస్తున్నారని తెలిపారు. వీ ఆర్ ఏ లు గౌరవంగా బ్రతకాలని, వారికి కూడా పే స్కేల్ ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందని గుర్తు చేశారు. ముందు ప్రకటించిన విధంగా వీ ఆర్ ఏ లకు పే స్కేల్ జీవో ను తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు.

ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో మండల
పార్టీ అధ్యక్షుడు యిప్పకాయల నర్సయ్య, నాయకులు మేకల భిక్షపతి, రేగొండ ఉప సర్పంచ్ గండి తిరుపతి, బానోత్ మోహన్, శ్యామల సురేందర్, ఏనుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.