సిపిఎం
వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు
ఆదివారం. దొడ్డి కొమురయ్య భవన్లో *ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం బాంచన్ నీ కాల్మొక్తా అన్న బడులను బంధుకులు పట్టించి నిజాం నిరంకుశ జాగీర్దారుల తరిమి కొట్టిన చరిత్ర ఐలమ్మ ది అని కొనియాడారు.నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భుామి పంచారనీ,4 వేల మందీ అసువులు బాసారనీ అన్నారు.నేడు కేంద్రం బిజేపి ప్రభుత్వం ప్రజా సంపదను జాతీ ఆస్తులను స్వదేశీ విదేశీ పెట్టుబడి దారులకు కారు చౌకగా అమ్మిందనీ అన్నారు.పెరుగుతున్న ధరలతో ప్రజలు కొనలేని తినలెేని స్తిథి లోకి వెల్లారనీ ఆవేదన వ్యక్తం చెేశారు.నిరుద్యోగులు ఉద్యోగ ఉపాదీలేక దిక్కుతోచని పరిస్థితులలో వున్నారని అన్నారు.నాటీ వీరతెలంగాణ వీరనారీ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణలో ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఆపాలని దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేపట్టాలని జరిగే పోరాటాల్లో ప్రజలు పాల్గొనాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం కేంద్రం ప్రజాకంఠక పాలకులుగా మరారనీ ప్రజా వ్యతిరేక విదానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండం పల్లి సత్తయ్య పుచ్చకాయల నర్సిరెడ్డి మండల కార్యదర్శి సైదులు నాయకులు కొండ వెంకన్న పోలే సత్యనారాయణ బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.