వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 గ్రామాలను భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలపాలి- గండ్ర

భూపాలపల్లి మహిళా పోలీస్ స్టేషన్,ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మరియు భూపాలపల్లి మండలానికి నూతన రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి …. గండ్ర

వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ 5 గ్రామాలను, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలపాలి … గండ్ర

ఈ రోజు నూతన పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు పై అసెంబ్లీ లో ప్రస్తావించిన
మన ప్రియతమ నాయకులు, భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు.

అసెంబ్లీ సమావేశం లో గండ్ర ప్రస్తావిస్తూ….

భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి సిరొంచ నుండి ఆత్మకూరు వరకు గల జాతీయ రహదారి భూపాలపల్లి పట్టణం మధ్య నుండి పోతుంది.

ఈ మార్గం ద్వారా ఎక్కువ గా బొగ్గు,ఇసుక మరియు ఇతర వాహనాలు ఎక్కువ వెళుతున్న నేపథ్యం లో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది.

ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడం కొరకు ఒక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

దానితో పాటు భూపాలపల్లి మండలం మరియు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి చాలా ఎక్కువ ఉంది మరియు అటవీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉంది భూపాలపల్లి రూరల్ కి ఒక్క పోలీస్ స్టేషన్ ను మంజూరు చేయాలని, అదే విదంగా భూపాలపల్లి నియోజకవర్గం,భూపాలపల్లి మండల పరిధిలోని 5 గ్రామాలు పెద్దాపురం, గుర్రంపెట,బావుసింగ్ పల్లి,సుబ్బక్కపల్లి, రాం నాయక్ తండా గ్రామాలు ములుగు జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి.

దీని ద్వారా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తున్న నేపథ్యంలో ఈ 5 గ్రామాలను భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలపాలి అని ప్రభుత్వం ను కోరారు.

ఈ సందర్భంగా సంబంధిత మంత్రి వర్యులు హోమ్ మినిస్టర్ శ్రీ మహమ్మద్ అలీ గారి దృష్టికి తీసుకెళ్తమని సభ ద్వారా తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.