వేద భారత్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం అవార్డు అందుకున్న-పల్లె రాజిరెడ్డి

జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ హైదరాబాదులో తెలంగాణ సరస్వతి పరిషత్ హాల్ నందు వేద భారత్ ఉత్తమ జాతీయ పురస్కార అవార్డు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి నిజాయితీగా స్వచ్ఛందంగా సేవ చేసిన కవులు,కళాకారులకు మరియు వివిధ రంగాలలో సేవ చేసిన వారికి పురస్కారం అందజేయడం జరిగింది.జఫర్ఘడ్ మండలంలోని కూనూరు గ్రామానికి చెందిన పల్లె రాజి రెడ్డి కరోన విపత్కర పరిస్థితులలో సేవలందించినందుకుగాను ఈరోజు హైదరాబాదులో ఘనంగా సత్కరించి వేద భారత్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జక్కిరెడ్డి,సుబ్బాయమ్మ,డాక్టర్ నవీన్,సినీ నటుడు బాబ్జీ,ఆర్ మస్తాన్,జెన్నీ,దామ మధుసూదన్ రావు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.