వేసవికాలంలో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి - ఎంపీపీ చింతా కవిత

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాప్రతినిదులు,అధికారులు సమన్వయంతో కృషి చేయాలి – ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

వేసవి కాలంలో నీటి ఎద్దడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశంలో సూచనలు చేసిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మిషన్ భగీరథ పనులు మరియు త్రాగునీటి సమస్యలపై సమీక్షా సమావేశంలో ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి గారు మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులలో జరగాల్సిన పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, వేసవికాలం రాబోతున్నందున ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని గౌరవ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి సహకారంతో అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో MPDO విజయశ్రీ,MPO పాండు రంగన్న, మిషన్ భగీరథ DE అభినయ్, AE లు రిత్విక్, సిద్దార్ధ, RWS AE రవి కుమార్, మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.