వైఎస్సార్ టిపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా జిల్లేపల్లి వెంకటేశ్వర్లు (జేవిఆర్)ను నియమించిన సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు పూల బుకే ఇచ్చి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం షర్మిల తో 38వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మాటా ముచ్చట కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జల్లేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా లో ప్రజా ప్రస్థానం పాదయాత్ర షర్మిలమ్మ ఆధ్వర్యంలో ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా కొనసాగుతుందని షర్మిలమ్మ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెలిశాల గ్రామంలో మాట
ముచ్చట కార్యక్రమంలో కూడా వేలాది మంది ప్రజలు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకుంటున్నారన్నారు. సూర్యపేట జిల్లాలోని సూర్యాపేట తుంగతుర్తి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో వైయస్సార్ తెలంగాణ పార్టీని బలోపేతం చేసి రానున్న ఎలక్షన్ లో నాలుగు నియోజకవర్గాలు షర్మిలమ్మ కు బహుమతిగా ఇవ్వడానికి వైయస్సార్ అభిమానిగా వైయస్ రాజశేఖర్రెడ్డి ఆశయ సాధన కొరకు కృషి చేస్తానని ఆయన తెలిపారు
