వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు-పచ్చిపాల రామకృష్ణ సంఘీభావం

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైయస్ షర్మిలమ్మ ప్రజా ప్రస్థానం పాదయాత్ర కు మునగాల మండల కేంద్రానికి చెందిన ‌ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ సంఘీభావం తెలిపారు సోమవారం నాడు సూర్యాపేట నియోజకవర్గంలో వైయస్ షర్మిలను కలిసి మద్దతు తెలిపారు అనంతరం అయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని నిరాహార దీక్ష చేపడితే అది తెలుసుకున్న నాటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ కృష్ణయ్య డిమాండ్లు న్యాయపరమైన వని ఆనాడు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి బలహీన వర్గాల విద్యార్థులలో రాజశేఖర్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారు చిర స్థాయిలో గుర్తుండీ పోతున్నార ని ఆయన అన్నారు ఆర్ కృష్ణయ్య గారి కోరిక మేరకు బలహీన వర్గాల విద్యార్థుల కోసం నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక్క బీసీ హాస్టల్ పెట్టారని నిరుద్యోగుల సమస్యల కోసం ఆర్ కృష్ణన్న పోరాడితే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ వేశారని అలాగే పేద ప్రజల కోసం ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టార ని ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఉచితంగా అందజేశారని స్త్రీలకు ప్రత్యేకంగా సున్నా వడ్డీ కి రుణాలు అందించారని అభయహస్తం పింఛన్ పెంచి వికలాంగుల వితంతు పింఛన్లు అమలు చేశారని రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని లక్షలాది ఇల్లు కట్టించి పేదల గుండెల్లో మూడు కట్టుకున్నారని ధాన్యానికి మద్దతు ధర కల్పించి ఆదుకున్నారని 9 గంటల ఉచిత కరెంటు ఇచ్చి పేదల పెన్నిధిగా ఉన్నారని పేద వర్గాలకు రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తించి ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజల సమస్యలుమీద నిరుద్యోగ సమస్యలు పై పోరాడుతున్న రాజన్న బిడ్డ అయినా వైయస్ షర్మిలమ్మ గారి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొలంపల్లి సుధాకర్ గౌడ్ రమేష్ గౌడ్ నవీన్ ముదిరాజ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.