వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ

వైస్సార్ పార్టీ స్థానిక ఎన్నికలలో విజయం సాధించి నందుకు వైస్సార్ పార్టీ నాయకుడు కోట.సంగయ్య, ఆధ్వర్యంలో.శుక్రవారం సాయంత్రం జమ్మలపురం..పాదయాత్ర గా వెళ్ళమని గ్రామ సర్పంచ్ పి.పుల్లయ్య తెలిపారు.
…గత30సంత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో
ఉన్న గ్రామం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, నందిగామ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక. జగన్ మోహన్ రావు,రాష్ట్ర వైస్సార్ పార్టీ నాయకుడు అరుణ్ చూపించిన చొరవ వలన చౌటపల్లి గ్రామంలో వైస్సార్ పార్టీ బలపర్చిన సర్పంచ్ గా గెలవటం జరిగిందని సర్పంచ్ వివరించారు.
గ్రామంలో అందరు సహాయ సకారంతో గెల్చినందుకు పార్టీ నాయకుడు కోట.సంగయ్య ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఎర్రు పాలెం మండలంలోని జమ్మలపురం లో. వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిదార్చించుకొని మొక్కుబడి తీర్చుకొనేందుకు గ్రామం నుంచి పాదయాత్రగా వెళ్లి నామని చెప్పారు..
ఈ కార్యక్రమంలో వైస్సార్ పార్టీ
నాయకులు హనుమంతరావు, రామారావు,సాయిబాబా, వైస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.