వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయిని రాజేందర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత శ్రీ. డా. వై. యస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేడు (08-07-2022) హన్మకొండ జిల్లా కాంగ్రెస్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.

ఈ సందర్బంగా శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ డా. వై. యస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ కి ఆయన చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడంలో యువత ముందు ఉండాలని కోరుతూ, శ్రీ. డా. వై. యస్. రాజశేఖర్ రెడ్డి గారితో తనకు ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గా ప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.