వ్యతిరేక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన అధికారులు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 ను పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ని మహబూబాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇట్టి ర్యాలీని ఉద్దేశించి డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యంగా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు( తంబాకు, గుట్కా మొదలైనవి) వాడటం వలన వచ్చే అనర్థాల గురించి చెబుతూ ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. సిఓటిపిఎ యాక్ట్ 2003 ప్రకారంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం చట్టవిరుద్ధమని, అలాగే విద్యాసంస్థల నుండి వంద గజాల లోపు పొగాకు ఉత్పత్తులను అమ్మడం నిషేధ మని మరియు 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులను అమ్మడం చట్టరీత్యా నేరమని ఎవరైనా ఇట్టి సూచనలను అతిక్రమించిన సిఓటిపిఏ యాక్ట్ ప్రకారము 200 రూపాయల జరిమానా లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుందని ఆయన తెలిపారు. దీని కొరకై పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో జిల్లాలో ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొగాకు నమలడం కానీ పీల్చడం ద్వారా పెదవి నాలుక, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు కలగవచ్చని, గుండెకు సంబంధించిన జబ్బులు రావొచ్చని మగవారిలో నపుంసకత్వం కలిగే.. అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇట్టి ర్యాలీలో మహబూబాబాద్ జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్ అంబరీషా, జిల్లా అసంక్రమిత వ్యాధుల కార్యక్రమ నిర్వహణ. అధికారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆరోగ్య విస్తరణాధికారి రామకృష్ణ, గోపి, వెంకన్న, సూపర్వైజర్ రత్నకుమారి డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వెంకన్న, అంగన్వాడీ సూపర్వైజర్ ఉష, ఆరోగ్య కార్యకర్తలు, కార్యకర్తలు, మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.