నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన వ్యయ పరిశీలకుడు విజయ్ చౌదరి మంగళవారం నల్లగొండకు చేరుకున్నారు.
జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో డిఐజి రంగనాధ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాగర్ ఉప ఎన్నికల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న చర్యలు, నామినేషన్స్, పోలింగ్ రోజున బందోబస్తుతో పాటు ఇతర వివరాలను ఆయనకు తెలియజేశారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు