వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్షాలు, ప్రతిపక్షాల,ప్రజాసంఘాలు, ఆధ్వర్యంలో రాస్తారోకో


ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ మహా సభ, సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, టీడీపీ, బహుజన కులాల ఐక్య వేదిక, ఎమ్మార్పీఎస్, అఖిలభారత భార్గవపద్మశాలి, యువజన జెఎసి, ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ గతవారం రోజులుగా ఢిల్లీలో ఉత్తరాది రాష్ట్రాల రైతాంగం 96 వేల ట్రాక్టర్ల ద్వారా లక్షలాది మంది నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణల బిల్లులను వెంటనే ఉపసంహరించాలి అని నినదిస్తు 2 రైతులు చలికి తట్టుకోలేక మరణించారని,ఆవేదన వ్యక్తం చేశారు.గిట్టుబాటు ధర అనే అంశం లేకుండా చేసిన చట్టం రైతుకు ఏం లాభం చేస్తుందని దుయ్యబట్టారు.స్వామినాథన్ కమీషన్ సిఫార్సులు అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ లకు అప్పచెప్పే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలొ ఆల్ ఇండియా కిసాన్ మహా సభ రాష్ట్ర నాయకులు మామిండ్ల రమేష్ రాజా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సోము సత్యం, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాచర్ల సారయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చెరుపల్లి యాదగిరి స్వామి, బహుజన కులాల వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి రాజుల సాంబయ్య, అఖిలభారత పద్మశాలి భార్గవ జిల్లా అధ్యక్షులు పెద్దూరు సోమశేఖర్, టిడిపి అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న, సోమ అశోక్ బాబు, మాసం పెళ్లి నాగయ్య,బెల్లిసంపత్ , జీడి సోమయ్య ,తూర్పాటి సారయ్య,భాస్కర్ ,సోమ వంశీ, యువజన జెఎసి నాయకులు, మలప రాజు నరేష్, సిరి పాటి రాజు, గాదరి యాదగిరి, దండు రామచంద్రు, ఇర్ల శ్రీను, దేవసనిరాజేష్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.