వ్యవసాయ చట్టాలపై మోదీ మొండివైఖరికి నిరసన


జనవరి 4న
ఛలోవిజయవాడ
ట్రాక్టర్ మరియు వాహన ర్యాలీకి తరలిఠండి.

రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా జనవరి 4వ తేదీన జరుగు చలో విజయవాడ కార్యక్రమానికి రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని రైతు సంఘం జిల్లా నాయకులు చనుమోలు సైదులు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం మన దేశ వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టడానికి మూడు
చట్టాలు తెచ్చింది. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్
స్థానంలో మీటర్లు బిగించి నగదు బదిలీ చేయాలని విద్యుత్ బిల్లు 2020ను తెచ్చింది. ఈ చట్టాలు
అమలు జరిగితే రైతాంగానికే కాదు కోట్లాది మంది భారతీయులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని,
రైతులు దివాళా తీస్తారు. కూలీలకు ఉపాధి పోతుంది. ఆహార భద్రతకు ముప్పు మవస్తుంది అన్నారు. బి.జె.పి
ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని గత 37 రోజులుగా పసి పిల్ల మొదలుకొని
పండు ముదుసలి దాక లక్షలాదిమంది రైతాంగం గడ్డకట్టే చలిలో నడిరోడ్లపై ఢిల్లీ సరిహద్దుల్లో
మన కోసం జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే 38 మంది ప్రాణాలు కోల్పోయారు
వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు. అయినను మోదీ ప్రభుత్వానికి కనికరం రాలేదు.
శత్రుదేశాలపై సైన్యాన్ని మొహరించినట్లు ఈ ప్రభుత్వం దేశానికే అన్నం పెట్టే రైతాంగం
పై యుద్ధం ప్రకటించింది. దేశ చరిత్రలో ఏనాడు లేనంతగా యావత్ భారత దేశ ప్రజల
అండదండలతో ఈ పోరాటం రోజురోజుకు విస్తరిస్తుంది. ఈ ఉద్యమాన్ని చూసి ఓర్వలేని కేంద్ర
ప్రభుత్వం అమాయక రైతులను ఉగ్రవాదులని ముద్రవేస్తుంది. ప్రజాగ్రహానికి తలొగ్గి చర్చలు
జరిపినా ప్రధాన కోర్కెలు అంగీకరించకుండా కాలయాపన చేస్తుంది. కార్పోరేట్లకు తలొగ్గి దేశప్రజలకు
తీవ్రమైన అన్యాయం చేస్తుంది. రైతాంగానికి, సామాన్య ప్రజలకు నష్టపరిచే వ్యవసాయ, నిత్యావసర
సరుకుల చట్టాలను రద్దుచేయడానికి అంగీకరించలేదు. తిరిగి “జనవరి 4” న చర్చలు జరగనున్నాయి
కాబట్టి అదేరోజు కేంద్రప్రభుత్వం మెడలు వంచదడానికి �
1.మూడు వ్యవసాయ చట్టాలు విద్యుత్ చట్టం రద్దు చేయాలని

2.రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టం చేయాలని

జనవరి 4వ తేదీన నిర్వహిస్తున్న చలో విజయవాడ ఈ కార్యక్రమానికి రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ డి కాసిం ,సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు కే గోపాల్, .వి ఏసోబు, ఎస్ఎఫ్ఐ నాయకులు, గోపీనాయక్, డివైఎఫ్ఐ నాయకులు హసేన్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.